Raavan | Villon | Aishwarya Rai | Abhishek Bachan | Maniratnam | "రావణ్" విడుదల తర్వాత పత్తాలేని "రాగిణి"
WD
అదలావుంచితే సినిమా విడుదలకు ముందు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కనబడినచోటల్లా "ఆహా రావణ్... ఓహో రావణ్" అంటూ గప్పాలు కొట్టారు. అభిషేక్ అయితే తన కెరీర్‌లో అటువంటి పాత్రను పోషించనే లేదని గొప్పలు పోయాడు. చివరికి సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు రావణ్ ముఖం చూడకపోవడంతో ఏం చేయాలో తెలియని అభిషేక్ - ఐష్ జంట మీడియా ముందుకు రావడానికి సాహసం చేయడం లేదు.
అభిషేక్ బచ్చన్ అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్నా... రావణ్ విషయం అడిగితే, ఆ సినిమాతో తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇక అందాల సుందరి ఐశ్వర్యారాయ్ అయితే మీడియా ముందు తన ముఖాన్ని చూపించడానికే ఇష్టపడటం లేదు. ఈ "రాగిణి" ఎఫెక్ట్ ఆమెపై ఎంతకాలం ఉంటుందో... ఏమో..!!
