1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Celebrity status

Kiss | Celebrity status | Hollywood | Tollywood | Rakhi savanth | Shilpa Shetty | గమ్మత్తు "ముద్దు"లతో పెరుగుతున్న సెలబ్రిటీల స్టేటస్!

ముద్దు
చుంబనం ధూర్తలక్షణం కాకపోవచ్చు. కానీ.. బహిరంగ ప్రదేశాల్లో (పబ్లిక్‌ ప్లేస్)లలో మాత్రం ఇది నిషిద్ధం. పాశ్చాత్య దేశాల్లో ఈ నిషేధాజ్ఞలు కూడా లేవు. విచ్చలవిడికి మారుపేరు పేరైనా హాలీవుడ్‌ చిత్రరంగానికి చెందిన సెలబ్రిటీలు ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. 

ఇందులో పురుషులు-మహిళలు, యువతీ యువకులు అనే తేడా కనిపించడం లేదు. మీడియా దృష్టిని ఆకర్షించాలని భావిస్తే చాలు ముద్దుల సీన్లలో మునిగి తేలుతున్నారు సెలబ్రిటీలంతా. ఈ పబ్లిసిటీ గురించి వినేవారికి కాస్త ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ.. సెలబ్రిటీలకు మాత్రం పైసా ఖర్చు లేకుండా మంచి పేరే తెచ్చిపెడుతోంది.

అందుకే పలువురు హీరోయిన్లు, ఐటంగాళ్స్ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఈ సూత్రాన్ని పాటించి మంచి పేరు కొట్టేసిన వారిలో ఐటంగాళ్ రాఖీసావంత్, శిల్పాశెట్టిలు అగ్రస్థానంలో ఉన్నారని చెప్పొచ్చు. ఎయిడ్స్ అవేర్‌నెస్ పోగ్రామ్‌లో పాల్గొన్న శిల్పాశెట్టిని రిచర్డ్ గారె వేదికపైనే ముద్దులతో ముంచెత్తాడు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనమైంది. మొన్నటి ఎమ్‌టీవీ మ్యూజిక్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలోనూ ఇదే జరిగింది.

సాండ్రా బుల్లక్, స్కార్లెట్‌ను డయాస్‌పైనే ముద్దుల వర్షం కురిపించారు. అవార్డు సంగతేమో గాని.. కెమెరాలు క్లిక్కుమనిపించిన ఈ కిస్సులే సాండ్రాకు పబ్లిసిటీ పెంచేశాయి. అలాగే, ఏడేళ్ల క్రితమే.. బ్రిట్నీ స్పియర్స్ పెదవులతో మడోన్నా ఓ ఆట ఆడుకుందట. స్కార్లెట్‌కు మార్గదర్శకురాలు మడొన్నా అన్నమాట. దీనిపై తొలుత తీవ్రస్థాయిలో దుమారం చెలరేగగా ఆతర్వాత మంచి పబ్లిసిటీ జరిగింది.
About Writer
PNR