Actress Sherlyn Chopra, Depression, | ఒత్తిడితో సతమతమవుతున్నారా...? నా దగ్గరకు రండి: షెర్లిన్
ఆయా వృత్తుల్లో ఒత్తిడికి సతమతమైపోయేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే దాని నుంచి బయటపడేస్తానని చెపుతోందట షెర్లిన్ చోప్రా. నీకది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తే... షెర్లిన్ ఇలా చెప్పుకొచ్చింది. "నా సినిమాలు, ఆల్బమ్‌లు అంతగా పాపులర్ కాక మునుపు కెరీర్ గురించి బాగా డిప్రెస్ అయ్యేదాన్ని. ఒక దశలో ఒంటరిగా కూచుని ఏడ్చేదాన్ని.
అలా ఏడిస్తే మాత్రం జరిగేది జరుగకుండా ఆపగలమా...? దేవుడు మనిషికి ఓ జన్మ ఇచ్చాడు. ఈ జన్మలో మనం చేసే పనులను బట్టి ఫలితాలు మారుతుంటాయి. పాజిటివ్ ఫలితాలొచ్చినప్పుడు ఎగిరి గంతేయడం, వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పుడు కుంగిపోవడం కూడదన్న సంగతి నేను తెలుసుకున్నాను.
అన్నిటికీ మించి తల్లిదండ్రులు లేని, దిక్కులేని అనాధల్లా బతికే పిల్లల ధైర్యాన్ని చూసినప్పుడు నా కెరీర్ విషయంలో నేను పడుతున్న బాధ అర్థం లేనిదనిపించింది. అంతే.. అప్పటినుంచి దేన్నైనా సాధించేవరకూ నిద్రపోయేదాన్ని కాదు. ఒకవేళ 100 శాతం ప్రయత్నం చేసినప్పటికీ దక్కాల్సింది దక్కకపోతే పెద్దగా ఫీలవనవసరం లేదు. దేవుడు నిర్ణయించిందే మనకు దొరుకుతుంది.
