Actor Navadeep | Hero daughter | Anchor | Tollywood | Love | నవదీప్ నాకు కాబోయే ఆయన: ఓ టీవీ యాంకర్
WD
ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలిసింది. దీంతో నవదీప్‌ను ఇంటివాడిని చేయాలని అతడి తల్లిదండ్రులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా నడుస్తుండగానే లేటెస్ట్‌గా ఓ ఛానల్‌లో యాంకర్‌గా ఉన్న అమ్మడి వెంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడట. అంతేకాదు ఆమెను కల్యాణం చేసుకుంటానని ఒట్టు కూడా వేశాడట.
దీంతో సదరు యాంకర్ "నవదీప్ నా కాబోయే భర్త" అంటూ ఛానల్లో ప్రచారం చేసుకుంటోందట. ఈ విషయం తెలిసిన నవదీప్ తల్లిదండ్రులు ఆమెను తమ కోడలుగా అంగీకరించేది లేదని తేల్చి చెప్పినట్లు భోగట్టా.
మరి నవదీప్ ఏమంటాడో... అని ఎదురు చూసేలోపే ఇంకో వార్త బయటకు తోసుకుంటూ వచ్చింది. అదేమంటే... ప్రముఖుల కుమార్తెలు పెండ్లి చేసుకున్నట్లు ఆర్యసమాజంలో పెళ్లి కానించేస్తాడనేది. "తా వలచిన వనిత రంభ" అంటే ఇదేనేమో..!!
