Mohan Babu | Ali | Jhummandi nadam | Raghavendra Rao | మోహన్ బాబుతో ఆడుకున్న హాస్యనటుడు అలీ
WD
పోలీసు జీపును మోహన్ బాబు కారు ఢీకొనే సన్నివేశంలో.. "హలో దోస్త్.." అని మోహన్ బాబు అంటాడు. వెంటనే అలీ అందుకుని "దోస్త్.. ఏంట్రా.." అంటూ సంబోధిస్తాడు. దీంతో మోహన్ బాబు " నన్నే రా..." అంటావా అంటూ గొడవపడ్డాడు. దానికి అలీ.. ఇది "నేను అన్నది కాదు. దర్శకేంద్రుడు అనమంటే అన్నాను. మీకిష్టం లేకపోతే చెప్పండి. నేను షూటింగ్ మానేసి వెళ్లిపోతా" అని ఝలక్ ఇచ్చాడు.
దీంతో మోహన్ బాబు చేసేది లేక.. ఆ సీన్‌ను మోనిటర్‌లో చూశాడట. ఆ తర్వాత సరే.. కానీ అంటూ సర్దుకున్నాడు. ఈ తతంగం చూసిన అక్కడి వారంతా లోలోపల బాగా ఎంజాయ్ చేశారట. అలాగే మంచు మనోజ్ చేత... మోహన్ బాబును తిట్టే సందర్భాలు ఉన్నాయి. అవన్నీ దర్శకేంద్రుడే కావాలని పెట్టాడని సమాచారం. ఇది తెలిసిన యూనిట్.. మోహన్ బాబుతో భలేగా ఆడుకున్నారు అని నవ్వుకున్నారట.
