Sexy shriya | Rana | Hyderabad | Love | Tollywood | ఆ రానా ఎవరో నాకు తెలీదు.. ఇక లవ్ ఎక్కడ?:శ్రేయ
ఇటీవల రానా - శ్రేయ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుక పోయారనీ, ఇద్దరూ హైదరాబాదులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో పొద్దుపోయిన తర్వాత కూడా చర్చించుకుంటూ కనబడ్డారనీ టాలీవుడ్ తెగ గుసగుసలు పోయింది. ఇదే విషయంపై శ్రేయను కదిలిస్తే కళ్లు ఇంతంత లావు చేసింది.
అసలు ఆ రానా ఎవరో తనకు తెలియదనీ, ఇంతవరకూ అతడిని చూడనే లేదని అంది.
ఓ వ్యక్తిని చూడనపుడు అతడితో తిరగడమేంటీ...? అంతా నాన్సెన్స్. ఎవరో "గాలి" రాయుళ్లు కల్పించిన కట్టు కథలివన్నీ అని మండిపడింది.
ప్రస్తుతం తాను షూటింగ్‌లతో బిజీగా ఉన్నాననీ, లండన్‌లో తన తాజా చిత్రం తాలూకు చిత్రీకరణ జరుగుతోందని చెప్పుకొచ్చింది. అయినా తాను ఇటువంటి గాసిప్స్‌ను పట్టించుకోనని చెప్పింది.
