Rakhee sawant | Sherlyn Chopra | షెర్లిన్‌తో లెస్బియన్‌గా నటించాలనుంది: రాఖీ సావంత్
రాఖీ సావంత్ లెస్బియన్‌గా నటించాలనుందని చెపుతుంది. యుమన్‌తో రొమాన్స్ బాగుంటుందని ఇటీవలే ముంబైలో చెప్పింది. షెర్లిన్ చోప్రాతో కలిసి నటిస్తానని అంది. స్వయంవరంతో హాట్ టాపిక్‌గా మారిన ఆమె మరోసారి ఇలా జర్క్ ఇచ్చింది.
స్వజాతి సంపర్కానికి చట్టబద్ధత వచ్చినప్పటి నుంచీ దాన్ని నేపధ్యంగా తీసుకుని ఎవరైనా చిత్రాన్ని చేస్తారా... అని వాకబు చేస్తున్నట్లు ప్రకటించింది. కొంతమంది తనను సంప్రదించినప్పటికీ కథలో బలం లేకపోవడంతో తాను "నో" చెప్పానని అంటోంది.
ఇక తనకు జోడీగా షెర్లిన్ చోప్రా అయితే బావుంటుందని తన వద్దకు వచ్చిన కొంతమంది నిర్మాతలకు చెప్పాననీ వెల్లడించింది. షెర్లిన్ కనుక దీనికి అంగీకరిస్తే ఇద్దరం కలిసి ఓ సంచలన చిత్రం చేసినట్లవుతుందని ఆశగా చెపుతోంది. మరి రాఖీసావంత్ మాటను షెర్లిన్ విన్నదో... లేదో...?
