Hot katrina kaif | sleepless nights | ఆ డైరెక్టర్ నన్ను నిద్రపోనివ్వడం లేదు: కత్రినా
బాలీవుడ్ హాట్ బేబీ కత్రినా కైఫ్‌ను ఓ బాలీవుడ్ దర్శకుడు నిద్రపోనివ్వడం లేదని వాపోతోంది. రాత్రి పూట అవుతుంటే చాలు... భయమేస్తోందనీ, నిద్రకు మొహం వాయాల్సి వస్తోందని కత్రినా తెగ బాధపడిపోతోంది.
ఇంతకీ ఆ డైరెక్టర్ ఏం చేస్తున్నాడేంటీ అని ప్రశ్నిస్తే... "ఇంకేం చేస్తాడూ...? రాత్రిపూట షూటింగ్‌లంటూ చంపుకు తింటున్నాడు. సాయంత్రం నాలుగు గంటలకు మొదలుపెట్టి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ ఒకటే పని చేయించుకుంటున్నాడు. రాత్రిపూట అదేపనిగా చేయాలంటే ఎంత కష్టమో రాత్రివేళల్లో మేలుకుని పనిచేసే వారికే తెలుసు" అంటూ నిష్టూరాలు పోతోందట.
కానీ చిత్ర దర్శకుడు మాత్రం.... చిత్రానికి సంతకాలు చేసేటపుడు ఈ సంగతి తెలియదా...? డబ్బులు తేరగా వస్తాయా ఏంటీ..? అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడట. రాత్రిపూట ఆమె ఒక్కర్తే కాదు.. ఆమెతోపాటు నేనూ కూడా మేలుకుంటున్నా అని జవాబిస్తున్నాడట. అంతేగామరి... ఒప్పుకుంటే ఖచ్చితంగా పని చేయాలి కదా...!!
