1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Anushka

Manchu Manoj | Anushka | Taapsi | అనుష్కకు షాక్... తాప్సీకి స్వీట్ ఇచ్చిన "మంచు"

మంచు మనోజ్
మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ "మాట" అంటే మాటలా..? మనోజ్ ఒకే ఒక్క మాట చెప్పాడంటే ఏ హీరోయిన్‌కైనా ఛాన్స్ తన్నుకుంటూ వస్తుంది. అదేమాట మరోసారి తిప్పి చెప్పాడంటే ఎంతటి అగ్రశ్రేణి హీరోయిన్‌కైనా వచ్చిన ఛాన్స్ వచ్చిన దారినే పారిపోతుంది. అసలు సంగతి ఏంటంటే...

ఆమధ్య మంచు మనోజ్ అనుష్కతో కలిసి "వేదం" చిత్రంలో నటించాడు. ఆ సమయంలో అందగత్తె అనుష్కతో సన్నిహితంగా ఉండేందుకు "మంచు" తెగ తహతహలాడిపోయాడట. అయితే అనుష్క దాదాపు "ఛీ" కొట్టినంత పని చేయడంతో చేసేది లేక దూరంగా జరిగిపోయాడట.

ఇదిలావుండగా ఇటీవల ఆర్‌బి చౌదరి బ్యానర్లో తమిళంలో నిర్మితమవుతున్న చిత్రంలో అనుష్కను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ చిత్రంలో అనుష్క వేశ్య పాత్రలో నటించనుంది. కానీ మంచు మనోజ్ ఆ చిత్రంలో అనుష్కను తొలగించి, ఆ అవకాశాన్ని తాప్సీకి ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేశాడట.

సోదరునికితోడు మంచు లక్ష్మీ ప్రసన్న కూడా ఒత్తిడి చేయడంతో కాదనలేని ఆర్బీ, ఆ ఛాన్స్‌ను తాప్సీకి కట్టబెట్టి అనుష్కకు మొండిచెయ్యి చూపించాడట. సో.. "మంచు"తో "కూల్‌"గా లేకపోతే ఏ హీరోయిన్‌కైనా హాటే మరి. తెలిసిందిగా...