1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Maniratnam

Suhasini | Maniratnam | Aishwarya Rai | ఐష్.. నిన్ను నేను డైరెక్ట్ చేస్తా: సుహాసిని మణిరత్నం

సుహాసిని
ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం భార్య, తెలుగు నటి సుహాసిని మాజీప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కథానాయికగా ఓ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. రావణ్ బోర్లా పడిన తర్వాత కూడా ఐష్ సుహాసిని సినిమా తీస్తానంటే సరేనని ఆమె మాటకు ఐష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందిట. 

"ఇద్దరు" సినిమా చిత్రీకరణ సమయం నుంచి సుహాసిని అంటే ఐశ్వర్యారాయ్‌కు ఎంతో గౌరవమనీ, ఆమెతో నెలకోమారైనా మాట్లాడకుండా ఉండలేదని ఐష్ సన్నిహితులు చెపుతుంటారు. వీళ్లద్దరి మధ్య ఉన్న ఈ చనువు కారణంగానే ప్రస్తుతం ఐష్ కథానాయికగా సుహాసిని దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు భోగట్టా.

రావణ్ చిత్రాన్ని రూపొందించే సమయంలో ఐశ్వర్యారాయ్ వెంట ఉండి ఆమెకు భాషతో ఇబ్బంది లేకుండా ఎంతో సహాయపడిందట సుహాసిని. ఆ సమయంలోనే తనవద్ద మంచి కథ ఉందనీ, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అనీ ఐష్‌కు ఆ కథ వినిపించిందట. ఐష్ కూడా కథ చాలా బావుందని "చేద్దాం" అన్నదట.
About Writer
Venkateswara Rao. I