Chiranjeevi | Director | Allu Arjun | Ram charan | Prajarajyam | చిరు దర్శకత్వంలో అల్లు అర్జున్ or మెగాస్టార్
WD
అయితే మెగాస్టార్ ఏ హీరోను డైరెక్ట్ చేస్తారన్న దానిపై టాలీవుడ్‌లో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన తన కుమారుడు రామ్‌చరణ్ కాకుండా మేనల్లుడు అల్లు అర్జున్ హీరోగా సినిమా రూపొందించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇదిలావుంటే మెగాస్టార్ దర్శకత్వ శాఖలోకి రాబోతున్నట్లు ప్రకటించడంతో ఇక ఆయన నటించే అవకాశం లేనట్లేనని కొందరు చెపుతున్నారు. అయితే ఆయనకోసమే ఓ సబ్జెక్టును సిద్ధం చేసుకున్నట్లు కోడి రామకృష్ణ ఇప్పటికే చెప్పారు కూడా. మరి మెగాస్టార్ నటించి దర్శకత్వం వహిస్తారో... లేదంటే స్వర్గీయ ఎన్టీఆర్‌లా ఆయనే హీరోగా రూపొందించే చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తారో వేచి చూడాల్సిందే.
