Taapsi | Anushka | Jhummandi Naadam | Vedam | Manchu Manoj Kumar | బొమ్మాళీ'' ఛాన్సు కొట్టేసిన హాట్ గర్ల్ తాప్సీ..!
WD
తొలి సినిమాలో నటిస్తుండగానే, రెండు మూడు చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేసిన తాప్సీ, ఏకంగా 'అరుంధతి' బొమ్మాళీ అనుష్క ఛాన్సునే కొట్టేసిందట. ప్రముఖ దర్శకుడు ఆర్.బి.చౌదరి రీమేక్ హక్కులు పొందిన తమిళ "వేదం"లో తాప్సీ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెన్నై కోడంబాక్కం వర్గాల సమాచారం.
ఇంకా తెలుగు "వేదం"లో అనుష్క నటించిన సరోజ పాత్రలో 'తాప్సీ' కనిపించనుందని తెలిసింది. ముందు తమిళ "వేదం"లో నమితను తీసుకోవాలనుకున్నారు. అయితే నిర్మాత మనసు మార్చుకుని అనుష్కతోనే అదే పాత్ర చేయించాలనుకున్నాడు. ఇంతలో ఏమైందోగానీ తాప్సీని సరోజ పాత్రకు ఎంపిక చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. కాగా.. తమిళ వేదంలో ఆర్.బి. చౌదరి కుమారుడు జీవా, మంచు మనోజ్ కుమార్, శింబులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది.
ఇదిలావుంటే.. రిపీట్ పాత్రలు పోషించడం అనుష్కకు ఇష్టం లేకపోవడంతోనే తమిళ "వేదం"లో సరోజగా నటించే ఛాన్సు తాప్సీకి వచ్చిందని ఫిలిమ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. కానీ అనుష్క పాత్రలో తాప్సీని వేస్తే బాగుంటుందని మంచు మనోజ్ సిఫార్సు చేసినట్లు కోడంబాక్కం వర్గాల సమాచారం.
