Actress Nayanatara | Hansika | Prabhudeva | వైట్ బ్యూటీ హాన్సికపై బ్లాక్ బ్యూటీ నయన్ గరంగరం
హాన్సిక పేరు చెబితే నయనతార భగ్గుమంటోంది. ఒళ్లంతా కంపరం పుట్టుకొస్తోందంటూ చికాకును ప్రదర్శిస్తోంది. కారణం ఏంటా అని ఆరా తీస్తే... హాన్సిక తరచూ ప్రభుదేవాను కలవడమేనని తెలిసింది.
నవ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా ఈ మధ్యనే తెలుగు "పోకిరి" చిత్రాన్ని తమళంలో, హిందీలో తీసి హిట్ కొట్టాడు. దీంతో ఆయనకు క్రేజ్ పెరిగింది. మరోవైపు ప్రభుదేవా ఫ్యామిలీ గొడవలతో సతమతమవుతున్నాడు.
మరోవైపు నయనతారతో పెండ్లి కూడా జరిగిపోయిందని ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే నటి హాన్సిక మాత్రం ప్రభుదేవా తాజాగా తీయబోయే "ఇచ్" చిత్రంతోపాటు హిందీలో చేసే చిత్రంలో తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా తరచూ ప్రభుదేవా గెస్ట్‌హౌస్‌కు రావడం, ఛాటింగ్ చేయడం జరుగుతోంది.
