1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Sex education

Lakshmi Prasanna | Sex education | Romance | సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం: లక్ష్మీ ప్రసన్న

లక్ష్మీ ప్రసన్న
సినిమాల్లో ముద్దు, రొమాన్స్ చూపించడంలో తప్పు లేదని మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న అంటోంది. మనవాళ్లు ఎందుకు దానిని తప్పుగా చూస్తున్నారో తనకు అర్థం కావడం లేదనీ, సెక్స్ ఎడ్యుకేషన్ అందరికీ ఎంతో అవసరమని తేల్చి చెపుతుంది. 

అసలు ముద్దులు పెట్టుకోకుండా, కాపురం చేయకుండా పిల్లలు ఎలా కంటారు. ఇవన్నీ నేటి తరానికి తెలియాలి కదా. అదేదో తప్పుడు భావనతో గోప్యంగా దాస్తే మరింతగా పిల్లల మనస్సులో నాటుకుని తప్పుడు పనులు చేయడానికి అవకాశం ఇచ్చిన వారమవుతాం.

దేవాలయాల్లో బూతుబొమ్మలు ఎందుకు పెట్టారు..? అసలు దేవుళ్లకు ఇద్దరు భార్యలు ఎందుకున్నారు..? వారిని సమర్థిస్తున్నాం కదా... అంటూ సెక్స్ ఎడ్యుకేషన్‌పై ఓ చిన్నసైజు లెక్చరిచ్చింది.

అసలు విషయం ఏమంటే... ఝుమ్మంది నాదం సినిమాకు ఆమె నిర్మాత. ఆ చిత్రంలో రొమాన్స్ ఎక్కువగా ఉందన్న ప్రశ్నకు... ఆమె పై విధంగా స్పందించింది. శృంగారం జీవితంలో భాగమనీ, దాన్ని వేరుచేసి చూపడం మరింత తప్పుచేసినట్లవుతుందని చెప్పింది. కరెక్టేగా.. కాకపోతే దేనికైనా లిమిట్స్ ఉంటాయని గుర్తు చేసింది.