ఎంత రుచి చూసినా... ఇంకా చూడాలనిపిస్తోంది: నేహా
ఓవర్ ఎక్స్పోజింగ్, అర్థనగ్నపు సన్నివేశాలలో అలవోకగా నటించే నేహాధూపియాను తన సెక్సీ ఫిగర్ వెనుక దాగున్న రహస్యం ఏమిటని అడిగితే, ఆపకుండా చెప్పడం మొదలుపెట్టింది.
" నేను సహజంగా పెద్ద తిండిబోతుని. గోవా ఆహారప్రియులకు స్వర్గం లాంటిది. ఇక్కడ అన్ని రకాలు లభిస్తాయి. అందుకే నాకు ఎప్పుడు టైం దొరికినా అక్కడకెళ్లి కడుపారా తిని వస్తా. పనిలో పనిగా కాసేపు గోవా బీచ్ వెంట సేద తీరుతా.
నా సినీ కెరీర్ జపనీస్ సినిమాతో ఆరంభించాను. ఇప్పుడీ విషయం ఎందుకు చెపుతున్నానంటే... అక్కడ నేను ఎంతో ఇష్టంగా తిన్న ఆహారం గురించి చెప్పడానికే. జపాన్లో సినిమా చేసేటపుడు, అక్కడి ఆహారం ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ, అక్కడి వంటకం "సుషి" తిన్నాక మళ్లీ మళ్లీ ఆ రుచే కావాలనిపిస్తోంది. ఇక ఫ్రెంచ్ ఆహారం కోసం లాప్లేన్ను ఇష్టపడతాను.

