1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Sradda doss

Navadeep | Sradda doss | Bike | pubs | నవదీప్ - శ్రద్ధా దాస్.. ఏం దూకుడండీ బాబూ...!!

నవదీప్
WD
హైదరాబాద్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడైన నవదీప్‌ పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. చందమామ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు.ఆ తర్వాత ఎందుకనో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే రాత్రి పార్టీలకు బాగా అలవాటుపడి జూబ్లీహిల్స్‌ బడాస్వాముల పిల్లల్తో కలిసి పార్టీలకు తెగ వెళ్తుంటాడు.

ఓసారి అలా కారులో ఫుల్‌గా మందుకొట్టి పంజాగుట్ట పోలీసులకు దొరికిపోయాడు కూడా. అది జరిగిన రెండు రోజులకు ఇటీవలే నవదీప్‌ బైక్‌రేస్‌లా విపరీతమైన దూకుడుతో తన గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి పోతున్నాడట. వారివెనుక మరో ఇద్దరు స్నేహితులు తమ గాళ్‌ఫ్రెండ్స్‌తో వెళుతూ ఓచోట పోలీసుల చెకింగ్‌ పాయింట్ వద్ద మళ్లీ దొరికిపోయాడట.

చెకింగ్‌ ఉందని తెలిసి స్లో చేసినా మందుతాగి ఉండడంతో మౌత్‌మిషన్‌తో కనిపెట్టిన పోలీసులు ఫైన్‌ వేయగా కట్టేశాడట కూడా. అయితే అదేసమయంలో అటుగా వస్తున్న ఓ ఛానల్‌వారు చూసి అతని వెంటపడ్డారట. కానీ చిత్రంగా ఆయనతో పాటు హీరోయిన్ శ్రద్దాదాస్‌ కూడా ఉండడంతో ఆశ్కర్యపోయారట.

చివరికి నవదీప్‌ను చేరుకుని ఎదురుగా వాహనాన్ని ఆపడంతో, కుర్రహీరో ఛానల్‌ వారితో లోపాయికారీ ఒప్పందానికి రావడంతో మొదటిసారి స్క్రోలింగ్‌ వేసి వెంటనే దాన్ని ఆపేయడం జరిగింది. అంటే లంచంతో ఛానల్‌వారు మెత్తబడ్డారన్నమాట. అయితే సదరు ఛానల్‌వారు ఓ సలహాకూడా ఇచ్చారట. ఇలాంటి దూకుడుతో బైక్ నడపవద్దనీ, వెనుక గాళ్‌ఫ్రెండ్‌ ఉంది కనుక కాస్త జాగ్రత్తగా చూసి పొమ్మని హితవు పలికారట.

దాంతో నవదీప్ వారికి థ్యాంక్స్‌ చెప్పి మళ్లీ రయ్యమంటూ తుర్రుమన్నాడట. ఏం చేస్తాం.. కుర్ర ఊపు కదా... అలానే ఉంటుంది మరి అని ఆ ప్రక్కనే ఉన్న ఓ వ్యక్తి మెల్లగా గొణిగడటం వినిపించి ఛానల్ విలేకరులు నిశ్చేష్టులై అక్కడే నిలబడిపోయారట.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి