1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Tollywood

Charmi | Tollywood | Nayanatara | Trisha | అందాలన్నీ చూపిస్తానన్నా ఛార్మికి ఆఫర్లు నిల్..!!

ఛార్మి
ఛార్మింగ్ గాళ్ ఛార్మి గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. కొత్త హీరోయిన్ల రాకతో ఛార్మిని హీరోలు పట్టించుకోవడం మానేశారని తెలిసింది. గ్లామర్ అందాలను ఎంతగా పరుస్తానని బాహాటంగా చెపుతున్నప్పటికీ ఆమె వైపు కన్నెత్తి కూడా చూడటం లేదట.

వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్రహీరోలు సైతం హీరోయిన్‌లు నయనతార, త్రిష, అనుష్కలవైపు మొగ్గుచూపుతున్నారని భోగట్టా. మరోవైపు కొత్త తాప్సీ, తమన్నా వంటి హీరోయిన్లు ఇపుడు కుర్ర హీరోయిన్లకు క్రేజీ స్టార్లుగా కనబడుతున్నారు.

దీంతో వారంతా ఆ బ్యూటీలను ఎంచుకుంటున్నారని తెలిసింది. దీంతో ఛార్మి గ్లామర్ వెలవెలబోతున్నట్లు ఫీలవుతోంది. చాలాకాలంగా ఊరిస్తున్న ఓ కొత్త సినిమా ఆఫర్ కూడా మిణుకుమిణుకుమంటూ కనిపిస్తుందే తప్ప చేతికి రావడం లేదు. దీంతో ఛార్మి శకం ముగిసినట్లే అంటున్నారు సినీజనం.
About Writer
Venkateswara Rao. I