1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Jr NTR

Samanta | Jr NTR | Bridavanam | అది నందమూరి స్టామినా అన్నారు ఎన్టీఆర్: సమంత

సమంత
సహజ అందాల తార సమంత జూనియర్ ఎన్టీఆర్‌ సరసన 'బృందావనంలో నటిస్తోంది. ఎన్టీఆర్ నటనను చూసి అచ్చెరువొందాననీ, అతని డైలాగ్ డెలివరీ సూపర్‌గా ఉందని తెగ పొగుడుతోంది. 

"జూనియర్ ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడమంటే మాటలు కాదు. ఆయన డాన్స్ అద్భుతంగా చేస్తున్నారు. ఆయన నటించిన 'ఆది', 'స్టూడెంట్ నెం1' యమదొంగ సినిమాలు చూశాను. అంత ఎనర్జీ ఎలా వస్తుందని అడిగాను.. చిరునవ్వుతో ఇది నందమూరి స్టామినా అన్నారు" అని నవ్వింది.

ఆయనతో నటించడంవల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను అని చెపుతున్న సమంతకు ఈ సినిమా చేయడం వల్ల మహేష్ బాబు,శ్రీను వైట్ల కాంబినేషన్‌లో అవకాశం వచ్చింది. మరి మహేష్ బాబును చూసి ఏం చెపుతుందో చూడాలి.
About Writer
Venkateswara Rao. I