Sonam Kapoor | Bikini | Bollywood | బికినీ వేయను.. వేస్తే సిగ్గుపడను: సోనమ్ కపూర్
సోనమ్ కపూర్ అంటే ఇపుడు బాలీవుడ్ కుర్రకారు చొంగ కార్చుకుంటున్నారట. ఆమెలో ఉన్న అంతటి ప్రత్యేకత ఏంటట... అని వారినడిగితే, ఎన్నెన్నో ఉన్నాయని ఏవేవో కబుర్లు చెపుతున్నారు. ముఖ్యంగా సోనమ్ డ్రెస్‌సెన్స్ అదిరిపోతుందని, అందాలను చూపించి చూపించకుండా వస్త్రాలంకరణ చేసుకుంటుందని చెపుతున్నారు. ఈ బ్యూటీ క్వీన్‌ను బికినీలో చూడాలనుందని అసలు సంగతి బయట పెట్టారు.
ఈ విషయాన్ని ఓ బాలీవుడ్ పిల్ల జర్నలిస్ట్ సోనమ్ చెవిన పడేశాడు. ఆ మాట విన్న సోనమ్ తనదైన సెక్సీ నవ్వును విసురుతూ... ఖచ్చితంగా బికినీ వేసుక నటించాల్సిన పాత్ర వస్తే నటిస్తానని చెప్పేసింది. అయితే తాను ఇప్పటి వరకూ బికినీ వేయలేదనీ, ఒకవేళ వేయవలసి వస్తే సిగ్గుపడి పోతూ బికినీ వేసుకుని ముడుచుక పోనని అంటోంది.
కొంతమంది తారలు బికినీ ధరించగానే ఏదో కొంపలు మునిగిపోయినట్లు శరీరంపై దుప్పట్టా కప్పుకుని ఎక్స్‌ట్రా చేస్తుంటారని అంటోంది. తాను మాత్రం అలా చేయననీ, బికినీ వేసుకుని సిగ్గు లేకుండా నటిస్తానని చెపుతోంది. సోనమ్ అంతగా చెపుతుంటే దర్శకులు మాత్రం ఎందుకు వదిలి పెడతారూ..? బికినీ పాత్రలేసుకుని వాలిపోరూ...!!!
