Actress Charmi | Devishree Prasad | Love affair | పడిపోతున్న ఛార్మిని ఒడిసి పట్టుకున్న దేవీశ్రీ
ఛార్మింగ్ గాళ్ ఛార్మికి ఈమధ్య సినిమాలు లేకపోయినప్పటికీ బిజీగానే ఉంటోంది. ఈ బిజీ ఎటువంటిదని అంటారా.. మరేం లేదు. పబ్బుల్లో తిరుగుతూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది.
ఛార్మికి మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తోందనీ, వారిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు ఆ మధ్య వచ్చాయి కూడా. ఈమధ్య జరిగిన ఓ సంఘటన ఇది నిజమేనని రుజువు చేస్తోంది.
ఇటీవల ఛార్మి, దేవీశ్రీ ప్రసాద్ ఇద్దరూ కలిసి పబ్బుల్లో చిందులేశారు. పబ్బుకు చీర కట్టుకొచ్చినప్పటికీ ఛార్మి రెచ్చిపోయి డాన్స్ చేసింది. అందరికీ అందాల ప్రదర్శన చేసింది.
