Tamanna | Happy days | Awara | Cut out | Palabhishekam | Paiya | హ్యాపీడేస్ తెల్లపిల్ల ''తమన్నా'' కటౌట్‌కు పాలాభిషేకం..!
WD
దీనిని పూర్తిగా 'తమన్నా అఖిల భారత గోల్డెన్ గర్ల్ ఫ్యాన్స్ సంక్షేమ సంఘంగా' పిలుస్తారు. భవిష్యత్తులో మరిన్ని తమన్నా సంక్షేమ సంఘ శాఖలను ఏర్పాటు చేస్తామని ఫ్యాన్స్ క్లబ్ వారు తెలిపారు.
మరోవైపు.. తమన్నా తాజా తమిళ చిత్రం 'పయ్యా' (తెలుగులో ఆవారా) ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో తమన్నాకు 50 అడుగుల కటౌట్‌ను కట్టి పాలాభిషేకం కూడా చేశారు.
ఈ విషయమై తమన్నాను ప్రశ్నిస్తే.. "నాకు అభిమానులు చాలా ముఖ్యం. అయితే ఈ ఫ్యాన్ క్లబ్ గురించి నాకు తెలియదు, ఒకవేళ అది జరిగితే వారి అభిమానాన్ని నేను గౌరవిస్తాను. కానీ.. ఈ పాలాభిషేకం వంటివి ప్రోత్సహించను. ఎందుకంటే..? ఇటువంటివి భగవంతుడికి మాత్రమే చెయ్యాలి" అని అమాయకంగా బదులిచ్చింది.. ఈ హ్యాపీడేస్ తెల్లపిల్ల తమన్నా..!.
