1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Nitya Pellikoduku

Gowri Pandit | Nitya Pellikoduku | Andhrudu | Aakasa ramanna | Love Marriage | Gopi Chand | నాకింకా పెళ్ళి వయస్సురాలేదు..!: గౌరీ పండిట్

గౌరీ పండిట్
WD
"నాకింకా పెళ్ళి వయస్సు రాలేదని" అందాల ముద్దుగుమ్మ గౌరీపండిట్ అంటోంది. అయితే తప్పకుండా ప్రేమ వివాహమే చేసుకుంటానని గౌరీపండిట్ చెబుతోంది. కానీ ప్రేమ పాఠాలు మాత్రం ఇంకా నేర్చుకోలేదు. ఎందుకంటే నాకింకా పెళ్ళి వయస్సు రాలేదని ఈ భామ అంటోంది.

"పెళ్లి వయస్సు వచ్చాక ప్రేమ పాఠాలు నేర్చుకుంటాను. ప్రేమవల్ల భాగస్వామి ఎలా ఉండాలో? తెలుసుకునే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య అవగాహన ఏర్పడుతుంది. అందుకే నాకు ప్రేమ పెళ్ళి అంటే ఇష్టం." అని 'ఆంధ్రుడు' హీరోయిన్ గౌరీ పండిట్ చెబుతోంది.

తాజాగా పోసాని కృష్ణ మురళీ హీరోగా నటిస్తున్న 'నిత్య పెళ్లికొడుకు' సినిమాలో నటిస్తోంది. 'ఆంద్రుడు'తో తెరంగేట్రం చేసిన గౌరీపండిట్ 'ఆకాశ రామన్న' అనే చిత్రంలోనూ నటించింది.

అయితే గోపిచంద్ హీరోగా నటించిన 'ఆంధ్రుడు' చిత్రం ఈ భామ గౌరీపండిట్ కు మంచి పేరు సంపాదించిపెట్టలేక పోయింది. కానీ పోసాని కృష్ణమురళీతో చేసే తాజా చిత్రం గౌరీపండిట్‌కు మంచి గుర్తింపునిస్తుందని సినీ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.