1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Jhummandinaadm

Success | Jhummandinaadm | Tapsi | Cinema | Raghavendra Rao | Manoj | అంగాంగ ప్రదర్శనే సినిమా సక్సెస్‌కు కారణం: తాప్సీ

సక్సెస్
WD
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'ఝుమ్మందినాదం' చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ తాప్సీ.

తన గ్లామర్‌తో యువతను కట్టిపడేసిన ఈ భామ.. ఝుమ్మందినాదం చిత్రంలో అంగాంగ ప్రదర్శన చేసింది. చిత్రంలో తాప్సీ చేసిన క్యారెక్టర్ కంటే.. ఆమె చేసిన ఎక్స్‌పోజింగ్‌కే మంచి పేరు వచ్చింది.

తన ఎక్స్‌పోజింగ్‌కు లభిస్తున్న క్రేజ్‌పై ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ.. "ఝుమ్మందినాదం" చిత్రం ద్వారా యువతకు తాను తెగ నచ్చేశానని ప్రచారం చేసుకుంటోంది. అంగాంగ ప్రదర్శన, ఎక్స్‌పోజింగ్‌ను దర్శకేంద్రుడు చెప్పినదానికంటే మరింత బాగా బాగా చేయడంవల్లే యువత థియేటర్లకు వస్తున్నారని ఓ తుంటరి విలేకరి తాప్సీని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు చిరునవ్వుతో సమాధానం ఇస్తూ.. వాళ్ళ వయస్సు అమ్మాయిని కాబట్టే నా అందచందాలు వారికి బాగా నచ్చాయి. దానికి తోడు తన అందాలను దర్శకేంద్రుడు ప్రత్యేక కోణంలో చూపించారు. పైపెచ్చు నటన కూడా బాగుంది అని చెప్పుకొచ్చింది. తాజాగా రవితేజ, విష్ణు, ప్రభాస్ సినిమాల్లో నటిస్తున్నట్టు తాప్సీ తెలిపింది.
About Writer
SELVI.M