1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Actress

Mamata Mohandass | Actress | Tollywood | మంచి క్యారెక్టర్ ఉన్న భర్త కావాలి: మమత

మమతా మోహన్ దాస్
కేరళలో పుట్టి బెహ్రెయిన్‌లో పెరిగిన మమతా మోహన్ దాస్‌ను 2005లో మలయాళ దర్శకుడు హీరోయిన్‌గా పరిచయం చేశాడు. ఆ తర్వాత చేసిన బస్ కండక్టర్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. 2007లో యమదొంగ సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. 

డాన్స్, సంగీతం, యాక్టింగ్‌లో శిక్షణ పొందిన ఆమె నటనతోపాటు సింగర్ కూడా అవ్వాలనే కోరికతో రాఖీలో పాడింది. మొదటి పాటకే ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా నంది అవార్డును దక్కించుకున్నది.

అయితే ప్రస్తుతం తన లైఫ్ గురించి చెపుతూ... ఎప్పుడూ ఆనందంగా ఉండాలనేది నా పాలసీ. భర్త కూడా అలాంటివాడే కావాలి. మంచి క్యారెక్టర్ ఉన్నవాడే భార్యను చక్కగా చూడగలడు అంటోంది. తెలుగులో ఆర్ఆర్ మూవీ మేకర్స్ తాజాగా చేయబోయే చిత్రంలో ఫోటో సెషన్‌కు హైదరాబాద్ వచ్చింది. త్వరలో మరిన్ని వివరాలు చెబుతానని అన్నది.
About Writer
Venkateswara Rao. I