1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. NTR

Samanta | NTR | Brindavanam | గుడ్లప్పగించి చూస్తుండి పోయా: సమంత

సమంత
నా అదృష్టం ఏమిటోగానీ మొట్టమొదటి సినిమాతోనే హిట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నానని సమంత చెప్పింది. 

ఇందుకు గౌతమ్ మీనన్‌కు థ్యాంక్స్ చెప్పింది. లేటెస్ట్‌గా ఎన్టీఆర్‌తో బృందావనంలో నటిస్తోంది.

ఈ చిత్రం షూటింగ్‌లో ఆయనతో అనుభవాన్ని గురించి చెపుతూ... నా పాత్రలో సాంప్రదాయం, సెక్సీతనం రెండూ కలిసి ఉన్నాయి. ఎన్టీఆర్‌తో డాన్స్ చేసే సన్నివేశముంది. ఆయన డైలాగులు, డాన్స్ చేస్తుంటే అలా చూస్తుండిపోయాను. నోట మాట రాలేదు.

అమ్మో ఆయనతో చేయడం చాలా కష్టం. అందుకే ఆయన సినిమాలన్నీ చూసేసి సెట్లోకి వెళ్లానని చెప్పింది.

ఇండస్ట్రీలో ఎవరికీ గ్యారంటీ లేదు. టాలెంట్‌తోపాటు అదృష్టం ఉండాలని చెప్పింది. నిజమే కదా...!!
About Writer
Venkateswara Rao. I