Girls | Love | Romance | Varun Sandesh | అమ్మో... అమ్మాయిలు ఇంత కామపిశాచాలా...?
WD
అయితే ఆ బస్సు దగ్గరకు వెళ్లాలంటే కొంతదూరం నడిచి వెళ్లాలి. అలా వెళ్లేటపుడు ఆ అమ్మాయిని తదేకంగా చూసేవాడిని. ఎందుకో ఆ అమ్మాయంటే నాకు ఆకర్షణ ఉండేది." అంటూ తన గత జ్ఞాపకాలను వెలికి తెచ్చారు. ప్రేమ, ఆకర్షణ ఏదనే విషయమై ఆయన పైవిధంగా స్పందించారు.
"హ్యాపీడేస్ చేసినప్పుడు కాలేజీ డేస్‌లో ఎలా బిహేవ్ చేయాలో అలా చేశానంతే.. అప్పటినుంచి హీరో అయినప్పటికీ ఇంతవరకూ ఎవరినీ ప్రేమించలేదు. హీరో అయితే ప్రేమిస్తారంటే చెప్పలేను. అమ్మాయిలకు ఏదో సమ్‌థింగ్ నచ్చాలి. అప్పుడే ప్రేమ దక్కుతుంది" అన్నాడు.
ఇంతవరకు ఏ అమ్మాయిని ప్రపోజ్ చేయలేదా..? అని అడిగితే.. నేను పబ్‌లకు వెళ్లను. వెళ్లినా అక్కడ డాన్స్ చేయను. అసలు ఆ కల్చర్ నాకు పడదంటున్నాడు.
అమెరికాలో పుట్టి పెరిగిన మీరు ఇలా అంటే ఎలా.. అక్కడే పుట్టి పెరిగిన ఓ అమ్మాయి... ఏకంగా తన కాలేజీ డేస్ పూర్తయ్యేసరికి 5వేలమంది పురుషులతో ఎంజాయ్ చేశానని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పింది కదా...? అని అంటే.. అమ్మాయిలు ఇంత కామపిశాచాల్లా తయారయ్యారా..? అందుకే నాకు అక్కడ కల్చర్ నచ్చదు అంటున్నాడు. లేటెస్ట్‌గా ఆయన నటించిన హ్యాపీహ్యాపీగా 20న విడుదలవుతుంది.
