Mamata Mohandass | Anushka | Cinema | జేజెమ్మ.. వేశ్య సరోజ పాత్రలు నాకే వచ్చాయ్.. కానీ..
నటి నుంచి గాయనిగా కూడా మారిన మమతా మోహన్ దాస్‌కు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్నాయి. అవి తన స్వంత నిర్ణయాలా..? మేనేజర్ల నిర్వాకాలా..? అనేది ఇప్పుడే బేరీజు వేసుకుంటోంది. అయితే ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అరుంధతిలో అవకాశం వస్తే శ్యాంప్రసాద్ రెడ్డి సినిమా అంటే... గతంలో చిరంజీవితో అంజి తీయడానికి ఐదేళ్లు పట్టిందనీ, ఈసారి ఎన్ని సంవత్సరాలు పడుతోందననీ భావించి తను చేయనని చెప్పిందట. ఆ అవకాశం అనుష్కకు దక్కడంతో ఆ సినిమా ఆలస్యంగానైనా విడుదలై అనుష్కకు ఎంతటి క్రేజ్ తెచ్చి పెట్టిందో తెలిసిందే.
ఇలాంటిదే మరో అవకాశం వేదంలో కూడా వచ్చింది. వేశ్య పాత్ర కాబట్టి మైనస్ అవుతుందని, కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని తిరస్కరించింది. అయితే పేరుకే వేశ్య కానీ అందులో అంత వేశ్యపు పనుల్లేవని ఆ తర్వాత తెలుసుకుంది. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా చేయడంతో రెండు భాషల్లోనూ మిస్ అయ్యానని తన సన్నిహితుల వద్ద తెగ బాధపడిపోతోందట.
