1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. mustache

Actor Ram | mustache | Rama rama Krishna krishna | సిన్మా ఫట్‌మన్నందుకు మీసం గొరిగించుకున్న రామ్

రామ్
WD
హీరోగా ఫోజు కొట్టాలంటే మీసం మెలేయాలి. ఆ మీసమే లేకపోతే.. వేరే షూటింగ్ కోసం తీసేశాను అని చెప్పాలి. అదీ కాదంటే ఏదో పందెం కాసి ఓడిపోయాడని అర్థం చేసుకోవాలి. అలాంటిదే హీరో రామ్ విషయంలో జరిగింది.

ఇటీవల ఓ ఫంక్షన్‌లో మీసాన్ని నున్నగా గీయించుకున్న రామ్ కన్పించాడు. అలా ఎందుకు మారాడా..? అని ఆరా తీస్తే... తను హీరోగా నటించిన చిత్రం "రామరామ కృష్ణకృష్ణ" సెంటిమెంట్‌గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని స్నేహితుల వద్ద శపథం చేశాడట.

అయితే ఆ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో మీసం గొరిగించుకోక తప్పలేదు. ఇంకా నయం గుండు చేయించుకుంటానని శపథం చేయలేదు. అలా చేసినట్లయితే మనం రామ్‌ను గుండులో చూడాల్సి వచ్చేది.

అన్నట్లు ఈ సినిమా కొన్నిచోట్ల బాగా ఊపందుకోవడంతో దిల్ రాజ్ సేఫ్ అయ్యారు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి