Balakrishna | Paramaveerachakra | Sheela | Amisha Patel | ఆ హీరోయిన్లు నాతో చేసేశారుగా...?: బాలయ్య
WD
నందమూరి వంశీయుడు బాలయ్యబాబు సింహా విజయంతో ఎంతో ఉత్సాహంగా ఉండటంతో తన తదుపరి చిత్రంలో నటించే భామల విషయంలో కాస్త జాప్యం జరుగుతూ వచ్చింది. విశేషమేమిటంటే... ఏ హీరోయిన్ పేరు చెప్పినా.. వీళ్లు చేసేశారు. ఇంకా కొత్తవారంటూ చెప్పడంతోపాటు... అసలు ఆ హీరోయిన్లు బాలయ్యతో చేసే స్థితిలో లేరు.
గతంలో సిమ్రాన్ బాలయ్యతో చేసినప్పుడు బాలయ్య పట్టుబడితే వదలడు అని చెప్పింది. ఆ పట్టు ఏమిటో ఆమెకే తెలియాలి. అయితే ప్రస్తుతం బాలయ్య సరసన షీలా అనే చెన్నై నటినీ, అమీషా పటేల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే వీరిద్దరూ భారీగా డిమాండ్ చేయడంతో చేసేదిలేక సరేనన్నట్లు తెలిసింది.
దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తున్న పరమవీరచక్ర కోసం ఈ అమ్మాయిల గోల.. ఇందులో బాలయ్య డబుల్ ఫోజ్‌లో కన్పిస్తాడు. ఒకరు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తే, మరొకరు దేశం కోసం త్యాగం చేస్తాడు.
