నేను వ్యభిచారం చేశానని నిరూపిస్తే కోటి రూపాయలిస్తా
WD
వ్యభిచారం కేసులో పోలీసులకు చిక్కిన సైరాభాను, జ్యోతిలు సవాళ్లపై సవాళ్లు విసురుతున్నారు. సైరాభాను ఒకడుగు ముందుకు వేసి తాను వ్యభిచారం చేస్తున్నట్లు ఎవరైనా నిరూపిస్తే వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని పెద్ద సవాల్ విసిరింది.
తమకు ఎటువంటి పాపం తెలీదని కోర్టు ముందు చెప్పిన మీదట సైరాతోపాటు జ్యోతిని కోర్టు వదిలి వేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సెక్స్ రాకెట్ ఉచ్చులో తాము అనుకోకుండా ఇరుక్కున్నట్లు సైరాభాను చెప్పుకొచ్చింది.
అయితే పోలీసులు మాత్రం వాళ్లిద్దరూ ఆ టైపు మనుషులేనని తెగేసి చెపుతున్నారు. వారు ఎంత వాదించినా నిజం అబద్ధం కాదనీ, అయినా దొంగతనం చేస్తున్న వ్యక్తితోపాటు కలిసి ఉన్న వ్యక్తి తాను దొంగను కాదని వాదిస్తే ఎవరు నమ్ముతారని వారు వాదిస్తున్నారు.