1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Drug Addiction case

Trisha | Drug Addiction case | rumors | Hyderabad | నాకు రోజూ బొచ్చెడు బోల్డుమంది ఫోన్లు చేస్తుంటారు

త్రిష
ఆమధ్య మాదక ద్రవ్యాల వ్యవహారంలో నైజీరియా వ్యక్తి వద్ద నటి త్రిష ఫోన్ నెంబరు ఉండటాన్ని పోలీసులు గమనించారు. దీంతో ఆమె కూడా డ్రగ్స్ ఉపయోగిస్తున్నదన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పలు ఛానళ్లు త్రిషపై పలు కథనాలు ప్రసారం చేశాయి. అయితే అవన్నీనిజం కాదని త్రిష కొట్టి పారేసింది. 

కమల్ హాసన్ చిత్రానికి సంబంధించి షూటింగ్ బిజీ వల్ల తాను విదేశాలలో ఉన్నాననీ, అసలు హైదరాబాదు వెళ్లి ఎన్నో నెలలు దాటిపోయిందని చెప్పుకొచ్చింది. సహజంగా తను గాలి కబుర్లను పట్టించుకోననీ, అయితే తనపై ఇటీవల వచ్చిన ఆరోపణ తీవ్రమైంది కావడంతో నేరుగా పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్‌తో మాట్లాడినట్లు వెల్లడించింది.

అయినా ఎవరో దారిన పోయే దానయ్య పుస్తకంలో తన ఫోన్ నెంబరు ఉంటే దానికి తాను బాధ్యురాలిని ఎలా అవుతానని ప్రశ్నిస్తోంది. తన మొబైల్‌కు ప్రతి రోజూ యాభైకి పైగా గుర్తు తెలియని కాల్స్ వస్తుంటాయనీ, వారెవరన్న సంగతిని తాను పట్టించుకోనని అంటోంది త్రిష. ఇపుడున్న మోడ్రన్ టెక్నాలజీతో ఎవరి ఫోన్ నెంబరునైనా ఇట్టే తెలుసుకునే వీలుందని అంటోందీ బక్కపలచని భామ.