నన్ను చూస్తే సల్మాన్ తప్ప ఏమీ గుర్తు రాదా..?: కైఫ్
FILE
కత్రినా కైఫ్‌కు కోపమొచ్చింది. ఏదో తన కెరీర్, నటించిన సినిమాల విజయాలను గురించి కబుర్లు చెపుతున్న సమయంలో ఓ తుంటరి జర్నలిస్ట్ కత్రినాకు మంటపుట్టే ప్రశ్న వేశాడు.
అతడి మాటల్లోనే.. ఏమిటి మిస్... ఇటీవల సల్మాన్ ఖాన్ - మీరు కలిసిపోయారనీ, పెళ్లి కూడా చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని అనుకుంటున్నారు. ఇందులో నిజమెంత ఉన్నదో కాస్త వివరిస్తారా..? అని అడిగాడు.
అంతే..! కత్రినా సివంగిలా ఎగిరెగిరి పడింది. బుగ్గలు ఎరుపెక్కి పోయాయి. కళ్లను పెద్దవి చేస్తూ... "నేను కనబడితే సల్మాన్ గురించి తప్ప ఇంకేమీ అడగరా..? నేను ఒంటరిగా ఉన్నాను. ఇంతకుమించి దానికి సంబంధించిన వివరాలను నేను చెప్పను... చెప్పలేను.
అయినా ఎన్నిసార్లు చెప్పాలయ్యా. చెప్పీ చెప్పీ నాకే విసుగు పుడుతోంది. ఒక పని చేస్తా... నేనెప్పుడైనా మాట్లాడాల్సి వస్తే, ముందుగా నేను ఒంటరిగానే ఉన్నా అని చెప్పి మిగిలిన వివరాలను చెపుతా.. అంటూ చిందులేసింది.
అయితే సదరు జర్నలిస్టు మాత్రం తనకు కావాల్సిన సమాచారం రావడంతో మారుమాట్లాడకుండా పేపరుపై ఏదో రాసుకుంటూ అక్కడి నుంచి లేచెళ్లిపోయాడు. అలా వెళుతున్న అతనివైపు కత్రినా కన్నార్పకుండా చూస్తుండి పోయిందట. ఏం చేస్తుంది..?