బాలీవుడ్‌లో తనకు గాడ్ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారూ.. అంటే వారు బోనీకపూర్, శ్రీదేవిలే అని చెప్పే అసిన్ వారికే ఓ షాక్ ఇచ్చింది. బోనీకపూర్ ప్రొడక్షన్స్ తాజా చిత్రంలో ఆమెను ఆఫర్ చేస్తే తిరస్కరించింది. పైపెచ్చు తిరస్కారానికి కారణాన్ని కనీసం చెప్పను కూడా చెప్పలేదట. అదేమని అడిగితే ఏవేవో కథలు చెపుతోంది.
ప్రస్తుతం తాను "బాడీగార్డ్", "రెడీ" చిత్రాలతో బిజీగా ఉన్నానంటోంది. ఈ చిత్రాలు వచ్చే ఏడాది దాకా పూర్తవవు కనుక వచ్చే ఏడాది వరకూ తన కాల్షీట్లు ఇవ్వడం సాధ్యం కాదని ముఖం మీదే చెప్పేసింది.
ఈ విషయం తెలిసిన శ్రీదేవి, బోనీలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారట. అస్సి తమకు చెప్పకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వింతగా ఉందంటున్నారు.