1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. TRS

Vijayashanti | TRS | Chandrasekhara Rao | "రాములమ్మ" మరో చిత్రం చేయడానికి రెడీ

విజయశాంతి
విజయశాంతిలో గొప్ప పోరాటపటిమ ఉన్నట్లు ఇటీవలే వెల్లడయింది. ఓ వివాదస్పద వ్యాఖ్య చేసి ఎన్నికల సంఘం వారిచే అరెస్ట్ వారెంట్‌ను అందుకోవడం, దాంతో ఆమె ఇంటిని పోలీసులు సోదా చేయడంతో ఆమె పరపతి మరింత పెరిగింది. 

పార్టీకి కావాల్సిన రెబల్ లక్షణాలున్న ఆమెను చంద్రశేఖరరావు మరింతగా ఆదరించారు. ఏది ఏమైనా ప్రస్తుతం వాడివేడిగా ప్రసంగాలు చేస్తూ, తెలంగాణా ప్రజల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తుంది. అయితే విజయశాంతి తెలంగాణా ప్రాంతానికి చెందినది కాకపోయినా తన బామ్మ పుట్టింది ఈ ప్రాంతంలోనే కావడంతో కొద్ది రోజులు ఆమె దగ్గర పెరగడంతో దాన్ని అస్త్రంగా ఉపయోగించుకుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె ప్రధాన పాత్రలో ఓ సినిమా చేసే ఆలోచన చేస్తున్నట్లు ఓ ఫంక్షన్‌లో పేర్కొన్నారు. కారణమేదైనా ఆ ఫంక్షన్ జరిగింది తెలంగాణాలో కాబట్టి అలా మాట్లాడారని కొందరు అనుకున్నా.. ఓ వీరవనిత జీవితగాధను ఆధారంగా చేసుకుని విజయశాంతితో సినిమా తీయాలని తెరాస నాయకులు అనుకుంటున్నట్లు తెలిసింది. పార్లమెంట్ సభ్యురాలు కనుక స్పీకర్ మీరాకుమార్ అనుమతితో ఆమె నటించనుందని తెలిసింది.