డేటింగ్‌కి రెడీయే.. కాకపోతే అతను హ్యాండ్ ఇవ్వకూడదు
WD
బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు దిగుమతి అయిన బెంగాలీ భామ మధురిమ. ఆ ఒక్కడు చిత్రంలో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యనే మౌనరాగంతో ముందుకు వచ్చింది. తాజాగా మరో సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు.
న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న ఈమె అనుకోని విధంగా నటిగా మారింది. ఆమె తన అభిరుచులను తెలుపుతోంది. "చీర కట్టంటే ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు జీన్స్ వేస్తుంటా. ప్రేమ అనేది నా చేతిలో వ్యవహారం. కుదిరితే ప్రేమించి పెండ్లి చేసుకుంటాను.
డేటింగ్ విషయంలో ఆసక్తి ఉంది. నాలుగేళ్లు కలిసిమెలిసి ఉండి కుదరక వేరొకరిని వివాహం చేసుకుంటే పరువు పోతుంది. చులకనయిపోతాం. అందుకే డేటింగ్ పక్కా అయితేనే అంగీకరిస్తా"నంటోంది. హ్యాండ్ ఇవ్వని డేటింగ్ పురుషుడని ఎలా కనుగొంటుందో ఈ మధురిమ..?