Hot Haripriya | Thakita Thakita | Kannada actress | Sandalwood | యడ్యూరప్ప కుమారునితో హిరిప్రియ "తకిట తకిట"..?
WD
ముఖ్యంగా ఈ సెక్సీ తార కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారునితో లవ్ ఎఫైర్ సాగిస్తోందన్న రూమర్లు కన్నడ సినీపరిశ్రమలో తిరుగాడుతున్నాయి.
అదలావుంచితే "తకిట తకిట"లో హిరిప్రియ పెర్‌ఫార్మెన్స్ పరంగానూ... గ్లామర్ పరంగానూ మంచి పేరు తెచ్చుకుంది. దీనిపై ఆమెను తెలుగు మీడియా కదిలిస్తే మరో కాంట్రవర్శీ సమాధానాన్ని చెప్పుకొచ్చింది. తను నటించే ప్రతి చిత్రం హిట్ అవుతుందనీ, అయితే సక్సెస్ అయిన ప్రతిసారీ కొంతమంది పనిగట్టుకుని తనపై లేనిపోని పుకార్లు పుట్టింస్తుంటారని అంటోంది.
శాండల్‌వుడ్ సినీ పరిశ్రమ సంగతి సరే.. టాలీవుడ్‌లో మీపై రూమర్లు పుట్టించడానికేముందీ...? అని ఓ విలేకరి ప్రశ్నిస్తే.. చూస్తుండండీ.. నాపై ఏదో ఒక గాలి కబురు ఖచ్చితంగా వస్తుందని బల్లగుద్ది మరీ చెపుతోంది. మరీ ఇంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలుగుతుంది చెప్మా..?!!
