Pawan Kalyan | Trisha | lip lock | Kushiga | Love Aaj Kal | పవర్‌స్టార్ పెదవులను చుంబించడానికి నేను రెడీ: త్రిష
WD
వివరాల్లోకి వెళితే... బాలీవుడ్ చిత్రం "లవ్ ఆజ్ కల్" చిత్రాన్ని తెలుగులో "ఖుషీగా" అనే పేరుతో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్- దీపికా పదుకునేల మధ్య అరడజను చుంబన దృశ్యాలున్నాయి. ఈ నేపధ్యంలో అటువంటి చుంబనాలనే హీరో పవన్ కల్యాణ్- త్రిషలు చేయాలని దర్శకుడు జయంత్ సి పరాన్జీ కోరాడట.
దీంతో త్రిష పవన్ పెదవులను చుంబించడానికి రెడీ అయిపోయిందట. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఆమె పెదవులను చుంబించేందుకు ససేమిరా అన్నాడట. అంతేకాదు అటువంటి చుంబన సన్నివేశాలేమైనా చేయాల్సి ఉంటే వాటన్నిటినీ తక్షణమే తొలగించాలని కోరాడట.
ఎందుకు చుంబించవని ప్రశ్నిస్తే.. తన సోదరుడు చిరంజీవి ప్రజలకోసం రాజకీయాల్లోకి వెళ్లారని, ఈ సమయంలో అటువంటి సన్నివేశాల్లో నటిస్తే ఆయన ప్రతిష్టకు భంగం కలిగే అవకాశముందని చెప్పాడట. కనుక తన సోదరుడు మెగాస్టార్ కోసం త్రిష పెదవులను చుంబించే సన్నివేశంలో నటించనని చెప్పాడట. పవన్ కల్యాణ్‌కు సోదర భక్తి మెండుగానే ఉన్నదన్నమాట.
