1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Vimala Raman

Priyamani | Vimala Raman | Gayam-2 | Exposing | Gossips | విమలా.. ఆ చిత్రంలో భలే ఎక్స్‌పోజింగ్ చేశావ్!: ప్రియమణి

ప్రియమణి
అందాల ముద్దుగుమ్మ, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి ఈ మధ్య ఎక్స్‌పోజింగ్‌కు పెద్ద పీట వేస్తోందట. ఎక్స్‌పోజింగ్ కోసం ఎవరినో సత్తాయిస్తుందట..? ఎవరినో కాదండీ బాబూ.. ఏకంగా మేనేజర్‌నే సత్తాయిచ్చింది. ఒళ్ళు దాచుకోకుండా నటిస్తానని, బడా దర్శకులు, నిర్మాతలు, హీరోల వద్ద ఈ విషయం చెప్పి కమిట్ చేయమని చెబుతోందట.

దీనికోసం హీరోలు, నిర్మాతలు, దర్శకులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య జగపతిబాబు సినిమాలో బాగా నటించిన విమలారామన్‌ను ప్రియమణి ఆదర్శంగా తీసుకుని, ఎక్స్‌పోజింగ్‌‌కు ఎగబడుతోందట. గాయం-2గా వచ్చిన జగపతి బాబు సినిమాలో విమలారామన్ ఎక్స్‌పోజింగ్‌ బాగా చేసింది.

ఈ సినిమాలో ఎక్స్‌పోజింగ్ రియలిస్ట్‌గా చేశావని విమలారామన్‌కు కూడా ప్రియమణి కితాబిచ్చిందట. అంతేకాదు.. ఈ మధ్య ప్రియమణి-విమలారామన్‌లు మంచి స్నేహితులుగా క్లోజ్ అయ్యారని సినీ వర్గాల్లో టాక్.

వీరిద్దరూ ఏ ఫంక్షన్‌కు వెళ్లినా జంటగా వెళ్తున్నారట. సినిమాల్లో తమ తమ పాత్రలపైనే కాకుండా ఎక్స్‌పోజింగ్ ఎలా చేస్తే బాగుంటుందని సలహాలు కూడా ఇచ్చిపుచ్చుకుంటున్నారట. మరి వీరి స్నేహంతో ప్రేక్షకులు, అభిమానులు ఏ మేరకు లాభపడుతారో వేచి చూడాల్సిందే..!
About Writer
SELVI.M