1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Upasana

Ramcharan | Upasana | Chiranjeevi | Tollywood | Chiranjeevi | ఉపాసన ప్రకృతిని ప్రేమిస్తుంది.. నేను సినిమాను ప్రేమిస్తా

ఉపాసన
File
FILE
చిరంజీవి కుమారుడు రాంచరణ్ త్వరలో ఒకింటివాడు కాబోతున్నాడు. అపోలో హాస్పిటల్స్ 23వ వార్షికోత్సవానికి ప్రత్యేక అతిథిగా హాజరైన చరణ్ తన పెళ్లి గురించి రెండు ముక్కలు చెప్పాడు. ఉపాసన, తాను పెళ్లి చేసుకోబోతున్నామనీ, అయితే పెళ్లి ఎప్పుడు జరుగుతుందన్నది పెద్దలు నిర్ణయించి వెల్లడిస్తారని చెప్పాడు.

హెల్త్ లైన్ అపోలో వారి అమ్మాయిని వివాహం చేసుకోవడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నవంబర్ లేదా డిసెంబరు మొదటివారంలో నిశ్చితార్థం ఉంటుందని సూచన ప్రాయంగా వెల్లడించారు.

ఉపాసన గురించి చెపుతూ... ఆమె చాలా చాలా సెన్సిటివ్. ఆమె ప్రకృతిని, జంతువులను ప్రేమిస్తుందనీ, తను మాత్రం సినిమాను ప్రేమిస్తానని నవ్వుతూ చెప్పాడు. ఇక తనేంటో ఉపాసనకు పూర్తిగా తెలుసుననీ అన్నాడు. అంతేగామరీ... ప్రేమలో ఒకరిని మించి మరొకరు చాలా అర్థం చేసుకుంటారు కదా...!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT