కోటలో "రాణి" ఉపాసనతో "మగధీర" రాంచరణ్ నిశ్చితార్థం..?!!
WD |
ఉపాసనతో రాంచరణ్ నిశ్చితార్థం ఎక్కడ జరుగుతుంది..? అనేదానిపై ఇప్పుడు చిరంజీవి అభిమానులలో ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ - ఉపాసనల ఎంగేజ్‌మెంట్ నిజామాబాద్‌లోని దొమకొండ కోటలో జరుగుతుందన్న ప్రచారం ఊపందుకుంది.
ఈ కోటను కేంద్రంగా చేసుకుని ఒకప్పుడు కామినేని సంస్థానాధీశులు పరిపాలించారట. కనుక రాణి కామినేని ఉపాసనకు మగధీర రాంచరణ్ తో నిశ్చితార్థం ఆ కోటలోనే జరుగుతుందని అభిమానులు గట్టిగా చెపుతున్నారు.
దీనికితోడు ఉపాసన తాతయ్య, మాజీ ఐఏఎస్ అధికారి ఉమాపతిరావు ఇప్పటికే కోటను నిశ్చితార్థం కోసం డెకరేట్ చేసే పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇదిలావుండగా నిజామాద్ జిల్లాలోని దొమకొండ వాసులు రాంచరణ్ తమ ఊరి అల్లుడు కావడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు.

