1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Prabhudeva

Second Marriage | Prabhudeva | Nayanatara | Ramalatha | Mumbai | Cinema | రెండో పెళ్ళి అయినా.. అంగరంగ వైభవంగా చేసుకుంటా...!

రెండో పెళ్లి
FILE
తన ప్రియుడు, నృత్యదర్శకుడు ప్రభుదేవాకు రెండో పెళ్లి అయినప్పటికీ.. నాకు మాత్రం మొదటి పెళ్లే కదా అని అంటోంది మలయాళ కుట్టి నయనతార. అందుకే... తన పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకోనున్నట్టు తెలిపారు.

ప్రభు-నయనల వివాహం ఇప్పటికే ముంబైలో ముగిసిపోయిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నయనతార మాట్లాడుతూ... ప్రభుదేవాను పెళ్ళి చేసుకోనే విషయంలో నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు మేమిద్దరం ఫ్రీ బర్డ్స్. ప్రభుని పెళ్ళాడేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఎవరికీ భయపడాల్సిన పని అంతకంటే లేదు.

ముఖ్యంగా.. ఎవరికీ చెప్పకుండా పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదన్నారు. అంతేకాదు రహస్యంగా పెళ్ళి చేసుకోవాల్సినంత దుస్థితిలో మేమిద్దరం లేమది. అందరికీ తెలిసేలా, స్నేహితులను, బంధువుల సమక్షంలో ఘనంగా, అంగరంగ వైభవంగా తమ పెళ్ళి జరుగుతుందని చెప్పింది.

తమ వివాహానికి సంబంధించిన వివరాలను తమ ఇద్దరి బంధువులు త్వరలోనే వెల్లడిస్తారని తెలిపింది. కానీ, మా పెళ్లి విషయంలో మీడియా అత్యుత్సాహం చూపుతూ.. కాస్తాంత విషయాన్ని అతి చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి