మగధీరను రికార్డులను అధిగమించనున్న దూకుడు?
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించి తాజాగా విడులైన చిత్రం దూకుడు. ఈ చిత్రం కలెక్షన్ల రికార్డు సునామీని సృష్టిస్తోంది. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ చరిత్రలో సరికొత్త రికార్డులను నెలకొల్పిని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన మగధీర రికార్డును తిరగరాసే దిశగా దూసుకెళుతున్నట్టు సమాచారం.
జి.రమేష్ బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హ్యాట్రిక్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ "దూకుడు" చిత్రం ఈనెల 23వ తేదీన విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం అన్ని ఏరియాల్లో సూపర్‌హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్స్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడుతూ.. ''దూకుడు' వరల్డ్‌వైడ్‌గా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకోవడం చాలా ఆనందంగా వుంది. మొదటి రోజు 12 కోట్ల 56 లక్షలు గ్రాస్ట్ కలెక్ట్ చేయగా, 10 కోట్ల 11 లక్షలు షేర్ సాధించింది. ఫస్ట్ డే కలెక్షన్స్‌లో ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది. ఓవర్సీస్‌లో రెండు రోజులకు ఒక మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి ఓవర్సీస్‌లో ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది.
ఈ చిత్రం ప్రదర్శింపబడుతున్న అన్ని థియేటర్స్ ఫుల్స్ అవుతున్నాయి. ఇండస్ట్రీలోని అన్ని రికార్డులను అధిగమించే దిశగా 'దూకుడు' దూసుకుపోతోంది. ఇంత సూపర్‌హిట్ చిత్రాన్ని మాకు అందించిన సూపర్‌స్టార్ మహేష్‌గారికి, దర్శకులు శ్రీను వైట్లగారికి, ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, కృష్ణ, మహేష్ అభిమానులకు మా ధన్యవాదాలు'' అన్నారు.