Allari Naresh | Dookudu | Mahesh babu | అల్లరి నరేష్‌కు "దూకుడు" మహేష్ బాబు పోటీనా..?!
WD
ఏడాదికి ఎక్కువ చిత్రాలు తీస్తూ నిర్మాతల్ని, కార్మికులను ఆదుకుంటున్న నరేష్‌కు ఇప్పుడు పోటీ ఎదురవుతోందనే టాక్ ఫిలింనగర్‌లో వ్యాపించింది. మాస్ హీరోలని చెప్పుకునేవారు సైతం కామెడీతోనే సినిమాను గట్టేక్కేలా చేసేస్తున్నారు. అందుకే రచయితలు, దర్శకులు సినిమాల్లో కథ లేకపోయినా కామెడీ మీద కసరత్తు చేస్తున్నారు.
ఫలానా హీరో అని చెప్పేకంటే.. అందరూ ఆ వైపు దృష్టి సారిస్తున్నారు. గ్లామర్ హీరోగా పేరు పొందిన మహేష్ బాబు కూడా రెండేళ్ళకు పైగా హిట్ లేక అల్లాడుతుంటే.. శ్రీనువైట్ల కామెడీతో 'దూకుడు'తో గట్టెక్కించాడు. అల్లరి నరేష్ మాత్రం తన రొటీన్ తరహాలో నటిస్తూ 'మడత కాజా' తినిపిస్తానని చెప్పాడు.
ఈమధ్య హీరోలంతా కామెడీవైపే మొగ్గుతున్నారు. మీకు పోటీగా భావిస్తున్నారా? అని అడిగితే.. ఏ ఆర్టిస్టుకైనా కామెడీ చేయడం చాలా కష్టం. నవరసాల్లో అది చాలా కీలకమైంది. సినిమాను ప్రేమించేవారెవరూ కామెడీ నచ్చదని చెప్పరు. అక్షయ్ కుమార్ లాంటి యాక్షన్ హీరోలు కూడా కామెడీతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. కామెడీచేసే హీరోలు సెంటిమెంట్ కూడా పండిస్తేనే సక్సెస్ అవుతారని చెప్పారు. మరి మహేష్ బాబు దూకుడులో భలే కామెడీ చేశారు కదా.. మీకు పోటీగా భావిస్తున్నారా.. అంటే అల్లరిగా ఓ నవ్వు నవ్వి సమాధానాన్ని దాట వేశాడు.
