1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Bollywood

Ramgopal Varma | Bollywood | Ra.One | Shahrukh Khan | డైరెక్టర్ పుడింగేమీ కాదు.. హీరోనే నెంబర్ 1: వర్మ

రాంగోపాల్ వర్మ
WD
రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటారు. తాజాగా షారుక్ ఖాన్ నటించిన రావన్ చిత్రం గురించి మాట్లాడుతూ... డైరెక్టర్ ప్రతిభ అని అందరూ అంటారు. కానీ ఎంత మంచి సబ్జెక్టయినా ఊరూపేరూ లేని ఓ కొత్త హీరోతో ఓ పెద్ద డైరెక్టర్ సినిమా తీస్తే ఆడుతుందా..? ఛస్తే ఆడదు.

ఎందుకంటే ఇక్కడ హీరోదో మెయిన్ రోల్. ఫలానా హీరో సినిమా అంటే జనం పరుగెత్తుకుంటా వస్తారు. అది చెత్త సబ్జెక్టయినా ముందు డబ్బులొచ్చేస్తాయ్. డిస్ట్రిబ్యూటర్లుకు బాధండదు.

అదే సూపర్ కథతో ఓ కొత్త హీరోని తీసుకుని సినిమా తీస్తే ప్రేక్షకులు ఆ సినిమా ముఖం కూడా చూడరని వర్మ అభిప్రాయపడ్డారట. వర్మ విశ్లేషణలో నిజం నూటికి నూరుపాళ్లు ఉందని బాలీవుడ్ సినీజనం అంటున్నారు. ఎంతైనా వర్మ ది గ్రేట్.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT