1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Tollywood

కుర్రకుంకతో అలాంటి సీన్లలో నటించిన "మదనమోహిని" సోనా

సోనా
ఆమధ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని కేసు పెట్టిన సోనా మీకు గుర్తుండే ఉంటుంది. గుర్తుంది.. ఐతే ఏంటటా..? అంటారా..? మరేంలేదు ఇపుడా భామ నటించిన సినిమా ఒకటి టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలవైపు దూసుక రాబోతోంది. 

దీపమున్నప్పుడే కదా ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా ఆమెకు వచ్చిన ఆ టైపు పబ్లిసిటినీ క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు ఆమె మలయాళంలో నటించిన "పట్టుపట్టు" అనే సినిమాను తెలుగు, తమిళాల్లో డబ్ చేస్తున్నారు. ఈ సినిమాలో సోనా ఓ టీనేజ్ బోయ్‌తో రొమాన్స్ సాగిస్తుంది.

ఇంకా చెప్పాలంటే పెళ్లయిన సోనా పెళ్లికాని కుర్రాడితో వివాహేతర సంబంధం సాగిస్తుంది. వాళ్లిద్దరూ అలా ఉన్నప్పుడు ఆమె భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. తెలుగులోకి వస్తున్న ఈ చిత్రం పేరు మదనమోహిని. సెక్స్, మిస్టరీల సమ్మేళనంతో వస్తున్న ఈ చిత్రంలో సోనా మసాలా సీన్లు బాగానే ఉన్నాయట. ఈ దెబ్బతో సోనా దశ తిరిగి షకీలా స్థానాన్ని ఆక్రమించేస్తుందేమో..?!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు- Webdunia Telugu సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి