Asin | Friends | Bollywood | Tollywood | Love | Salman Khan | కేఆర్‌కే మోజులో అసిన్ : స్నేహితుల ఆగ్రహం!
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేసిన అగ్ర కథానాయిక అసిన్. ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత కొత్త ప్రియుడుని బుట్టలో వేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరైన కేఆర్‌కే. పూర్తి పేరు కమల్ రషీద్ ఖాన్. ప్రముఖ నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా, కథా రచయితగా, పాటల రచయితగా పలు సినిమాలకు పని చేశారు. ఇలా అన్ని రంగాల్లో పావీణ్యం ఉండటం వల్లే కేఆర్‌కేను అసిన్ ప్రేమించినట్టు సమాచారం.
ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాల కోసం వేచి చూస్తున్న ఆసిన్, ఎవరిని కాకా పడితే అవకాశాలు రాలుతాయో అనే విషయాలు చాలానే తెలుసుకుందట. రెడీ సినిమా తర్వాత సల్మాన్‌తో ఉన్నా లాభం లేదనుకున్న తర్వాతే కేఆర్‌కేతో పరిచయం ఏర్పరచుకున్నట్టు సమాచారం.
అంతేకాకుండా, ఈయన కోసం అసిన్ ఈ మధ్య సెక్సీగా తయారు కావడంతో పాటు.. అతనితో సన్నిహితంగా వ్యవహరిస్తూ సెక్సీగా వ్యవహరిస్తోందట. మరి ఆసిన్ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో వేసి చూడాల్సిందే.
