Kajal Agarwal | Asin | lux Soap Advertisement | Film | కాజల్ - అసిన్‌ల మధ్య చిచ్చుపెట్టిన సబ్బుబిళ్ళ!
టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు హీరోయిన్ల మధ్య ఒక సబ్బుబిళ్ల చిచ్చుపెట్టింది. ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు మరెవరో కాదు. ఒకరు కాజల్ అగర్వాల్ అయితే.. మరొకరు అసిన్. సుదీర్ఘ చరిత్ర ఉన్న లక్స్ సబ్బు ప్రచారం కోసం ఈ ఇద్దరు భామల పోటీ పెరిగి పోవడంతో వారి మధ్య చిచ్చుకు కారణమట. తమ ప్రాడక్ట్ ప్రచారం కోసం ప్రతి ఏడాది ఈ లక్స్ సంస్థ, పెద్ద మొత్తంలో పారితోషికాన్నిచ్చి అందాల హీరోయిన్లతో ప్రచార చిత్రాలు రూపొందిస్తుంటుంది.
అలా ఈ ఏడాది కాజల్, అసిన్‌లను తమ ప్రచారకర్తలుగా ఎంచుకుంది. వీరిద్దరూ కూడా ఈ ప్రచార చిత్రం షూటింగ్ సమయంలో ఎంతో సన్నిహితంగా, స్నేహంగా మెలిగారు. అయితే, యాడ్ రిలీజ్ అయ్యాక, అసిన్ చిర్రుబుర్రులాడుతోందట. కారణం ఏమిటంటే, ఆ చిత్రంలో తన కన్నా కాజల్ అందంగా ఉండటంతో క్రెడిట్ అంతా ఆమె కొట్టేస్తోందని అందరూ ఆసిన్‌కి చెబుతున్నారట.
దీంతో, కాజల్‌తో ఈ మలయాళం బేబీ మాట్లాడడం మానేసిందని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినొస్తున్నాయి. కాజల్ ఫోన్ చేసినా ఆసిన్ రెస్పాండ్ కాకపోవడంతో తెగబాధపడిపోతోందట. ఇకపై ఆసిన్‌తో కలిసి యాడ్స్ చేయరాదని నిర్ణయించుకుందట.
