1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Raju Hirani

అసిన్ - రాజు హిరానీల మధ్య లింకు ఉందా..?(వీడియో)

అసిన్
ఏ హీరోయిన్ అయినా బాలీవుడ్‌లో కాలు పెడితే చాలు... లింకెట్టేస్తారు బాలీవుడ్ పాడుజనం అంటున్నారు అసిన్ ఫ్రెండ్స్. అసలు సంగతి ఏంటయా..? అని ఆరా తీస్తే, అసిన్ ఈమధ్య ఓ దర్శకునితో ప్రేమాయణ సాగిస్తోందట.

గజినీ చిత్రం సమయంలో అమీర్‌తో క్లోజ్ ఉంటోందన్న పుకార్లు వినవచ్చాయి. అవి కొట్టిపారేసి వెనక్కి తిరిగి చూసేసరికి మళ్లీ కొత్తగా సల్మాన్‌తో ఎఫైర్ మొదలెట్టిందని చెప్పుకొచ్చారు. అదీ కాదని తోసిపుచ్చిన అనంతరం ఇక ఏమీ ఉండదులే అనుకుంటే.. కొత్తగా మళ్లీ రూమర్ తెరపైకి వచ్చేసింది.

సౌజన్యం: ఏబీఎన్ తెలుగుటీవీ
హౌస్‌ఫుల్ 2లో బిపాస ప్రియుడు జాన్ అబ్రహాంతో పీకల్లోతు ఎఫైర్‌లో పడి అసిన్ కొట్టుకుపోతుందన్న వాదనలు వచ్చాయి. ఐతే ఆ తర్వాత అవి కూడా గాలివార్తలని కొట్టేసింది. అన్నట్లుగానే ఆ తర్వాత జాన్ అబ్రహాంతో మళ్లీ కనిపించలేదు.

ఐతే తాజాగా మరో పుకారు షికారు చేస్తోంది. అదేంటయా.. అంటే, మున్నాబాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్ డైరెక్టర్ రాజు హిరానీతో అసిన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందట. హిరానీ తన తాజా చిత్రం కోసం ఈ అమ్మడిని విదేశాలకు కూడా తీసుక వెళుతున్నాడట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి