1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Gutta Jwala

Vedinte | Gutta Jwala | Prabhas | Cinema | Vikram | Deeksha Seth | వీడింతే ఫంక్షన్‌లో గుత్తా డ్రెస్ అదుర్స్: ప్రభాస్‌తో కొత్త సినిమా!?

వీడింతే
FILE
సినిమా కళాకారులు క్రీడాకారులుగా సన్నివేశాల్లో అవతారంఎత్తవచ్చునేమయో గానీ నిజంగా మారలేదు. కానీ క్రీడాకారులు సినిమారంగంలో వచ్చి అందులో టాలెంట్‌తో నిలదొక్కుకోవచ్చు. గతంలో అశ్వనీనాచప్ప తన పేరుతోనే చిత్రంలో నటించి మెప్పించి. మళ్ళీ ఆ తర్వాత సినిమాల జోలికి పోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.

కొందరు బ్యాడ్మింటన్‌ ఆటగాళ్ళు బాలీవుడ్‌లో నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఆ కోవలో గుత్తాజ్వాల వచ్చింది. ఇటీవల సినిమా ఫంక్షన్లలో హాజరవుతూ వస్తోంది. సినిమారంగంలోని యువ హీరోలు కొందరితో కలిసి చదివిన ఆమె తరచూ సాయంత్రం ఫంక్షన్లకు రావడం సినిమావారిని ఎంటర్‌టైన్‌ చేయడం జరుగుతోంది.

కానీ, ఆమెవేసుకున్న డ్రెస్‌ క్రీడారంగంలో బాగుంటుందేమోగానీ... సినిమా ఫంక్షన్లకు హీరోయిన్లను కంటే ఎక్కువగా తన గ్లామర్‌ను చూపిస్తోంది. ఇటీవలే విక్రమ్‌ నటించిన 'వీడింతే' ఫంక్షన్‌కు వచ్చిన డ్రెస్‌కోడ్‌ అందరినీ ఆశ్చర్యపర్చింది. దాంతో ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలతో క్లిక్‌ అంటూ తెగ బంధించేశారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడిని ప్రేమించి పెండ్లిచేసుకుని తదంతరం విడాకులు ఇచ్చిన గుప్తా ఈ ఫంక్షన్‌కు ఎవరో కుర్రవాడిని తీసుకువచ్చింది.

తనకంటే అతను బెరుగ్గా ఉండడం అక్కడివారిని ఆశ్చర్యపర్చింది. ఇదిలా వుండగా, విశ్వసనీయ సమాచారం ప్రకారం గుప్తాజ్వాల ఓ ప్రముఖ బేనర్‌లోనటించనున్నది. ఆ చిత్రంలో ప్రభాస్‌ హీరోగా నటించనున్నట్లు తెలిసింది. టెన్నిస్‌లో అందాలు సినిమా అందాలు దేనికి జనాలు ఎగబడాతారో చూడాలి.
About Writer
SELVI.M