1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Rajinikanth

Asin | Rajinikanth | 2012 new Year | రజినీతో చేస్తున్నానని నేనూ విన్నాను: అసిన్

అసిన్
నూతన సంవత్సర వేడుకలు ఈసారి కేరళలో చేసుకుంటున్నాననీ, ఇందుకు తనకు చాలా ఆనందంగా ఉందని కేరళ కుట్టి అసిన్‌ చెప్పింది. క్రిస్మస్ వేడుకలు సొంత ఊరులో చేసుకునేందుకు కుదరలేదంది. ముంబైలోనే చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. 

కేరళలో వాగమాన్‌ అనే ప్రాంతంలో ఇల్లు కొన్నాననీ, అక్కడే కుటుంబసభ్యుల మధ్య నూతన సంవత్సరం, గృహప్రవేశం వేడుకలు చేసుకుంటానని అంటోంది అసిన్.

రజనీకాంత్‌తో నటిస్తున్నారటగదా అని అడిగితే... నేనూ వార్తల్లో విన్నాను. ఆయనతో నటించాలనుంది. అవకాశం వస్తే మాత్రం వదులుకోనని చెబుతోంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT